Breaking:ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-07-25 08:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(గురువారం) అసెంబ్లీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదుపు తప్పిన శాంతిభద్రతల పై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో మావోయిస్టులను చాలా వరకు నియంత్రించాం అన్నారు. మావోయిస్టులను, రౌడీలపై ఉక్కుపాదం మోపాం, పీడీ చట్టం ప్రయోగించాం అని తెలిపారు. రాష్ట్రంలో రౌడీ అనే పేరు వినబడకుండా చేశామన్నారు. హైదరాబాద్ మత సామరస్యానికి విఘాతం లేకుండా చేశాం.

హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని అన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేశామని తెలిపారు. గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్‌ను డెవలప్ చేశాం. నాపై 17 కేసులు పెట్టారు, దాడులు జరిగిన ఏ మాత్రం భయపడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం. రాజకీయాలను ఉపయోగించుకుని ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా చేశారని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. టీడీపీ వల్లే రాయలసీమాలో ఫ్యాక్షనిజం అంతమైందని అన్నారు. గతంలో హైదరాబాద్‌లో కర్ఫ్యూలు పెట్టే పరిస్థితి ఉండేది..30 రోజుల వరకు కర్ఫ్యూ ఉండేది..మత ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడ్డారు. గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు అన్నారు. పోలీసులు, వైసీపీ నేతలతో కుమ్మకై నిబంధనలు ఉల్లంఘించారని ఫైరయ్యారు.

AP News:‘ఇంగ్లీష్ మీడియం కావాలి..కానీ తెలుగును మరువద్దు’ ..మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News