ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే: Cm Chandrababu
ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేనని సీఎం చంద్రబాబు అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే(Savitribai Phule) అని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu) అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి(birth anniversary) సందర్భంగా ఆమెకు ఘననివాళి(Tribute) అర్పించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని చంద్రబాబు తెలిపారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం తెలిసిందేనని చెప్పారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఆమెను తాను ఘననివాళి అర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శం. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే… pic.twitter.com/aKIEK2QfnC
— N Chandrababu Naidu (@ncbn) January 3, 2025