CM Chandrababu:సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

గత వారం రోజుల నుంచి ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy Rains) లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

Update: 2024-09-05 11:15 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత వారం రోజుల నుంచి ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy Rains) లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక విజయవాడ జిల్లాలో అయితే వరదలు బీభత్సం(panic) సృష్టించాయి. ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను(Victims) ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వదలడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బుడమేరు(Budameru) వరద ప్రవహిస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ సహాయక కార్యక్రమాలను సీఎం స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు ముధరా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలో ట్రాక్‌పై నుంచి ట్రైన్ వస్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది(Security) గమనించి ట్రైన్ వస్తుందని సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఈ విషయాన్ని గమనించిన కార్యకర్తలు వెంటనే లైన్‌మెన్‌ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్‌కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ నెమ్మది అయ్యింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును సెక్యూరిటీ చుట్టుముట్టారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు కూడా చంద్రబాబు వెన్నంటి ఉన్నారు. ట్రైన్ సరిగ్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో భద్రత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


Similar News