కలెక్టర్లకు చంద్రబాబునాయుడు వార్నింగ్

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు.

Update: 2024-08-05 10:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. తమ ఐదేళ్ల కాలంలో పాలన ఎలా ఉండాలో, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో కలెక్టర్లకు వివరించారు. పథకాల అమలులో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎంఎల్ఏలు, ఎంపీలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించామని. కలెక్టర్లు, అధికారులు కూడ ఎల్లప్పుడూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల్లోకి మరోసారి వెళ్ళి ఓట్లు అడగాలి అంటే పథకాల అమలు, లబ్దిదారుల గుర్తింపు మొదలగు విషయాల్లో నాయకులతోపాటు, అధికారులంతా నిబద్దతతో పని చేస్తేనే సాధ్యమని అన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిచేయాలని, రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటికి అందరినీ సంసిద్దులు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సదస్సులో పేర్కొన్నారు. అహంకారపూరిత ధోరణి విడనాడి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ, అవసరమయితే పొరుగు జిల్లాల అధికారుల సహాయం తీసుకుంటూ కూడ ముందుకు వెళ్ళాలని అన్నారు.   


Similar News