AP:పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష (Hunger strike) చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష (Hunger strike) చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి ధృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ తరుణంలో వచ్చే ఏడాది మార్చి 16 వరకు వీటిని నిర్వహిస్తాం అన్నారు. రాజధాని అమరావతి(Amarawati)లో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు గ్రామం అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చెప్పారు. ఈ మేరకు నేడు(ఆదివారం) ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు.