స్వర్ణాంధ్ర సాధనపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సంచలన కార్యక్రమానికి శ్రీకారం

స్వర్ణాంధ్ర సాధన వైపు సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు...

Update: 2024-09-28 06:04 GMT

దిశ, వెబ్ డెస్క్: స్వర్ణాంధ్ర సాధన వైపు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandra Babu Naidu) అడుగులు వేస్తున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. 2047 నాటికి నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వినూత్న కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు స్వీకరించాలని నిర్ణయం ఇచ్చారు. ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్వర్ణాంధ్ర సాధనపై సూచనలు, అభిప్రాయాలను swarnandra. ap. gov. in మెయిల్ ద్వారా ప్రజలు తెలపాలని సూచించారు. ప్రజల సహకారానికి ఈ సర్టిఫికెట్‌తో అభినందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకాశవంతమైన ఏపీ రూపకల్పనకు పౌరులుగా ప్రజల సూచనల ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరి సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. సమిష్టిగా స్వర్ణాంధ్రను నిర్మికుందామని చెప్పారు. 2047 నాటి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్@2047(Swarnandhra Pradesh@2047) వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చంద్రబాబు పేర్కొన్నారు. 


Similar News