Buchaiah Chowdary: తిరుమలలో ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందే: బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్

తిరుమల (Tirumala) క్షేత్రంలో ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి (MLA Buchaiah Chowdaray) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-28 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) క్షేత్రంలో ఎవరైనా ఆచారాలు పాటించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి (MLA Buchaiah Chowdaray) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ (Former CM Jagan) ఎన్నడూ సతీసమేతంగా తిరుమలకు వెళ్లిన దాఖలాలు లేవని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలో ఉన్న నాడు శ్రీవారి పట్టు వస్త్రాల సమర్పణలోనూ నిబంధనలు తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. జగన్‌ను బైబిల్ (Bible) చదవొద్దని ఎవరూ అనలేదని కామెంట్ చేశారు. ప్రతి మనిషికి మతం అనేది ఓ విశ్వాసం, నమ్మకమని హితవు పలికారు. తాము ఒకవేళ చర్చి, మసీదుకు వెళితే అక్కడి ఆచారాలను కూడా పాటిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా తిరుమలలోనూ కొన్ని ఆచారాలు ఉన్నాయని, వాటిన పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. హిందూ మతం గురించి జగన్ (Jagan) ప్రశ్నిస్తున్నారని.. తిరుమలలో డిక్లరేషన్ (Declaration) ఇచ్చేందుకు సమస్య ఏమిటో ఆయకే తెలియాలని అన్నారు.    


Similar News