వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటిస్తున్నారు. నేడు వకుళమాత వంటశాలను ప్రారంభించారు.

Update: 2024-10-05 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం కుటుంబంతో సహా.. తిరుమలకు చేరుకున్న ఆయన.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం వకుళమాత వంటశాలను ప్రారంభించారు.

ఉదయం తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి ఆనం, టీటీడీ అధికారులు హాజరయ్యారు. తిరుమల పవిత్రత, భక్తులకు తిరుమలపై ఉన్న నమ్మకాన్ని కాపాడేలా అందరూ పనిచేయాలని సీఎం సూచించారు. అలాగే స్వామివారి ప్రసాదాల తయారీకి వాడే నెయ్యితో పాటు అన్ని పదార్థాల నాణ్యత మెండుగా ఉండేలా చూడాలని ఆదేశించారు. వీఐపీ సంస్కృతిని తగ్గించి.. సాధారణ భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలిపారు. 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజున స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్దశేష వాహనం)పై తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఈ వేడుకను భక్తులు కన్నులారా వీక్షించి, స్వామివారికి హారతులు పట్టారు.

శనివారం (అక్టోబర్ 5) ఉదయం 8 గంటల నుంచి స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు మురళీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ స్వభూపాల వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. 

Tags:    

Similar News