ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజీవ్ భవన్ చేరుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజీవ్ భవన్ చేరుకున్నారు. అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి సీఎం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. కాగా అంతకు ముందు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణ పనులపై మంత్రితో చర్చించారు. అలాగే రాత్రి ఎంపీలతో విందు సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్..
ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.