CM Chandrababu: బుడమేరు గండ్ల పాపం గత పాలకులదే.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
బుడమేరు గండ్ల పాప గత పాలకులదేనని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బుడమేరు గండ్ల పాప గత పాలకులదేనని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కృష్ణ జల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పారిశుధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ (YCP) పాలనలో బుడమేరు గండ్లను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నుంచి భారీగా వరద నీరు వచ్చిందని గుర్తు చేశారు. బుడమేరు (Budameru)కు గండిపడి విజయవాడ పట్టణం (Vijayawada City) అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చిందని అన్నారు. ఆరు అడుగుల మేర వరద నీరు రోడ్లు, ఇళ్లల్లో నిలిచిందని తెలిపారు. నగరంలో నీరు పోయే పరిస్థితి లేక పైనుంచి వస్తున్న వరద నీటితో ప్రజలకు తల్లడిల్లారని పేర్కొన్నారు. అంతటి వరదలోనూ బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించామని అన్నారు. లక్షలాది మంది ప్రజలకు అధికారుల సాయంతో అవసరమైన సేవలను అందించామని అన్నారు.
ప్రజల కోసం బురదలో నడిచామని, ఏకంగా జేసీబీల్లో ప్రయాణించి వరద నీటిలో ముందుకు వెళ్లామని అన్నారు. అదేవిధంగా ప్రజలకు అన్ని రకరాల సదుపాయాలు కల్పించి కుదుట పడిన తరువాతే తాను అక్కడి నుంచి వచ్చానని సీఎం తెలిపారు. నా ఆలోచనలకు తగినట్లుగా స్వచ్ఛ సేవకులు అద్భతంగా పని చేశారని కితాబిచ్చారు. మరోవైపు డ్రైనేజీ, మురుగు నీరు కలిసిపోయి గందరగోళంగా మారిందని.. ఆ సమయలో పారశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు అంటు వ్యాధులు ప్రబలకుండా తమ సేవలను నిరంతరం అందించారని గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీని వదర బాధితులకు ఇచ్చామని అన్నారు. ప్రతి ఇంటికి రూ.25 వేలు ఇవ్వడం దేశంలోనే ఇదే ప్రప్రథమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. కష్టాలు, విపత్తులు వస్తే మనవతా ధృక్పథంతో ఆలోచన చేయాలని తెలిపారు. బైక్‌లు, ఆటోల మరమ్మతులకు కూడా రూ.10 వేలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక మొదటి అంతస్తులో ఉన్న వారికి కూడా రూ.10 వేల చొప్పుల ఆర్ధిక సాయం అందజేశామని అన్నారు. నేడు ప్రభుత్వం అందించిన సాయంతో వరద బాధితులు ధీమాగా సీఎం అన్నారు. వరద బాధితుల కోసం రూ.450 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) కు దాతలు సాయం చేయడం ఒక చరిత్ర అని అన్నారు. తన జీవితంలో ఇంత సాయం గతంలో ఎన్నడూ చూడలేదని, మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేసిన అందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.