CM Chandrababu:వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్‌‌లో వరద(Flood) ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) ఏరియల్ సర్వే(Aerial Survey) నిర్వహించారు.

Update: 2024-09-06 11:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌‌లో వరద(Flood) ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) ఏరియల్ సర్వే(Aerial Survey) నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ(Vijayawada)లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో బుడమేరు ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు, వాటిని పూడ్చే పనులను పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొల్లేరు(Kolleru)లో కలుస్తుందో ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితులను గమనించారు. అంతేకాదు, బుడమేరు(Budameru) ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని, కృష్ణా నది(Krishna River) సముద్రంలో కలిసే చోటును, లంక గ్రామాలను కూడా ఏరియల్ సర్వేలో సీఎం చంద్రబాబు పరిశీలించారు.


Similar News