తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..
దిశ, తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వరాహాస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలు, హాకర్ లైసెన్సులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు కేటాయించిన స్థలాల్లోనే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.