MP Guru Murthy: ప్రధాని మోడీకి లేఖ.. సంచలన డిమాండ్

దక్షిణ భారత్‌లోనూ పార్లమెంట్ సమావేశాలునిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది..

Update: 2024-12-01 14:31 GMT

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ భారత్‌(South India)లోనూ పార్లమెంట్ సమావేశాలు(Parliament Sessions) నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కోరుతోంది. ఇప్పటి వరకూ ఢిల్లీకే పరితమైన ఈ సమావేశాలు దక్షిణ భారత్‌లో జరగాలని ఆకాంక్షిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ(Prime Minister Modi)కి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. కనీసం ఏడాదికి రెండు సెషన్స్ అయినా దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇదే విషయాన్ని ‘భాషా పాలిత రాష్ట్రాలు’ అనే పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం ప్రస్తావించారని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై విశాల దృక్పధంతో ఉండాలని మాజీ ప్రధాని వాజ్ పేయ్ సైతం చెప్పారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో గుర్తు మూర్తి కోరారు. 

Tags:    

Similar News