పుంగనూరులో టీడీపీ నాయకుడి కిడ్నాప్‌కు యత్నం.. ఉద్రిక్తత
పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడు హేమాద్రిని.. వైసీపీ నాయకుడు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకుల ఆందోళనకు దిగారు. నాగభూషణం ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఇంటి వెనక నుంచి టీడీపీ నాయకుడు హేమాద్రిని వైసీపీ నాయకులు వదిలేశారు. ఈ ఘటనతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే తమ నాయకులను కిడ్నాప్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణను అధికమయ్యే అవకాశాలున్నాయని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు ఎన్నికల సంఘం కూడా బందోబస్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర బలగాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్వహణకు చకా చకా ఏర్పాట్లు చేస్తోంది.