టీటీడీ డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి మహిళా డిగ్రీ మరియు పీజీ క‌ళాశాల‌(అటానమస్), శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ (అటానమస్), శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాల(అటానమస్)

Update: 2024-10-06 14:47 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి మహిళా డిగ్రీ మరియు పీజీ క‌ళాశాల‌(అటానమస్), శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ (అటానమస్), శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాల(అటానమస్), ఎస్వీ ప్రాచ్య(ఓరియంటల్) క‌ళాశాల‌, ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు అక్టోబ‌రు 7 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్‌ను సంప్రదించాలని కోరారు. స్పాట్ అడ్మిష‌న్లు పొందిన వారికి హాస్ట‌ల్ వ‌స‌తి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాల‌ర్‌షిప్‌లు ఉండవని ఆయన తెలిపారు.


Similar News