Tirumala: శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి తెలంగాణ చీరల బహూకరణ

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ తిరుమల వెంకటేశ్వరస్వామికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు..

Update: 2023-04-09 11:56 GMT

దిశ, తిరుపతి: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ తిరుమల వెంకటేశ్వరస్వామికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చేతుల మీదుగా చీరలను అందించారు. స్వామికి రూ. 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గి పెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే పద్మావతి అమ్మవారికి అగ్గి పెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర తయారు చేయించారు.

Tags:    

Similar News