ఫెంగల్ తుపాను బీభత్సం.. అడుగు లోతు నీటిలోనే అంతిమ యాత్ర

పెంగల్ తుఫాను చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. ..

Update: 2024-12-01 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్: పెంగల్ తుఫాను చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఎటు చూసినా గ్రామాలు చెరువులు తలపించాయి. పలుచోట్ల ఇళ్లలోని నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే నగరిలో వ్యక్తి అంతిమయాత్ర నిర్వహించేందుకు బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం చనిపోయిన వ్యక్తికి ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే అంతిమయాత్ర మాత్రం అడుగు నీటిలో జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి నగరి చుట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై అడుగు మేర నీరు నిలిచిపోయాయి. దీంతో నీటిలోనే వ్యక్తి అంతిమ యాత్ర చేయాల్సి వచ్చింది. వ్యక్తి పాడె మోసిన జనం వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామం నుంచి ఊరి చివరన ఉన్న శ్మశానం వరకూ నీటిలోనే నడిచి ఎట్టకేలకు వ్యక్తి అంత్యక్రియలు ముగించారు. 

Tags:    

Similar News