Cheetah:ఆ జిల్లాలో చిరుత పులి కలకలం

నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర చిరుతపులి సంచారం కలకలం రేపింది.

Update: 2024-10-19 07:46 GMT

దిశ, నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర చిరుతపులి సంచారం కలకలం రేపింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో వాటర్ మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి చిరుత పులిని చూసి భయాందోళనకు గురయ్యాడు. ఈ సంఘటనను రోల్లపాడు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. ఈ విషయంపై ఫారెస్ట్ డీఆర్ఓ తహిర్ బాషను ఫోన్‌లో సంప్రదించగా చిరతపులా? లేక మరేదైనా జంతువు అన్నది నిర్ధారించలేమని వర్షం పడడంతో పాదముద్రలను గుర్తించడం కష్టమైందని పూర్తిస్థాయిలో కూంబింగ్ నిర్వహించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అప్పటివరకు ఏ జంతువు అనేది కరెక్ట్ గా నిర్ధారించడానికి వీలుకాదని తెలిపారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం కస్తూర్భా గాంధీ పాఠశాల సమీపంలో అలాగే కాకిలేరు వాగు సమీపంలో పులి సంచారం ఉన్నట్లు గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుకార్లతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.


Similar News