నగరంలో రెచ్చిపోయిన రౌడీ మూకలు.. టీడీపీ నేతపై రాడ్లతో దాడి

రాష్ట్రంలో ఇటీవల రౌడీ మూకలు దాడులకు తెగబడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు.

Update: 2024-10-19 09:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల రౌడీ మూకలు దాడులకు తెగబడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు(TDP) శివ కొండారెడ్డి పై గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. నగరంలో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్(Police station) పరిధిలో రోడ్డుపై వెళ్తున్న శివ కొండారెడ్డి(Shiva Konda Reddy) పై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో(Iron rods) విపరీతంగా కొట్టారు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కడప నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పై స్పందించిన స్థానికులు వెంటనే అతడిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.


Similar News