తిరుపతిలో మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం

తిరుపతి తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు...

Update: 2024-08-16 03:08 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు. కొత్తపాలెం లే అవుట్‌లో రాత్రి ముగ్గురు దుండగులు మరణాయుధాలతో హల్ చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజులను పరిశీలించి చెడ్డీగ్యాంగ్‌ను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఊళ్లకు వెళ్లే సమయంలో తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 

Tags:    

Similar News