‘యాక్షన్ స్టార్ట్’.. సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే పని మొదలెట్టిన చంద్రబాబు

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.

Update: 2024-06-09 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 175 స్థానాలకు గానూ 164 చోట్ల గెలుపు కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టానున్నారు. ఈ ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రారంభించిన చంద్రబాబు యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం తెప్పించుకుని బాబు పరిశీలిస్తున్నట్లు టాక్.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలకాంశాలపై వరుస రివ్యూలు ఉంటాయని అధికారులకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో గుస గుస వినిపిస్తున్నాయి. ప్రజా సంబంధిత అంశాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తగదని బాబు అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత వరుస సమీక్ష సమావేశాలు ఉంటాయని బాబు హింట్ ఇవ్వడంతో వివిధ శాఖల సెక్రటరీలు మీటింగ్‌లకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. 


Similar News