Ap Elections 2024: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయం.. సంతృప్తికరంగా చర్చలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు కలిశారు...

Update: 2023-12-17 17:19 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై గంటన్నరకుపైగా చర్చించారు. సీట్లు సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై సుధీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు తిరిగి ఆయన నివాసానికి వెళ్లిపోయారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి ప్రభుత్వం, మంచి పాలన అందించేందుకు చర్చలు జరిగాయని పేర్కొన్నారు. 

కాగా టీడీపీ-జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే తాజాగా చంద్రబాబునే పవన్ నివాసానికి వెళ్లి కలిశారు. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రెండు నెలల ముందుగానే జరుగుతాయన్న సమాచారంతో ఇద్దరు అధినేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.  వైసీపీని ఎలా ఢీకొట్టాలనే అంశాలపై కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల కార్యకర్తలతో టీడీపీ, వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పరస్పరం సహకరించుకోవాలని ఇరు పార్టీల కార్యకర్తలకు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News