చంద్రబాబు బయటకొస్తున్న వేళ మరో కీలక పరిణామం.. ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్

వరుస కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును వైసీసీ ప్రభుత్వం

Update: 2023-10-31 06:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును వైసీసీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం మద్యం కేసులో చంద్రబాబును సీఐడీ చేర్చింది. అక్రమ మార్గంలో మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలతో చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో ఏ3గా చేర్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టేందుకు సీఐడీకి ఏసీబీ కోర్టు అనుమతి జారీ చేసింది.

ఈ క్రమంలో మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ ఇవాళ దాఖలు చేశారు. చంద్రబాబు అత్యవసర పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా.. మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి. చంద్రబాబుపై మధ్యంతర పిటిషన్‌పై ఇవాళ తీర్పు వచ్చిన నేపథ్యంలో.. నిన్న హఠాత్తుగా చంద్రబాబుపై మరో కేసు నమోదు చేయడం గమనార్హం.

Also Read..

చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్: ఆ కేసులో చర్యలు తీసుకోబోమన్న సీఐడీ 

Tags:    

Similar News