Visakhapatnam:రేపు విశాఖకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రేపు(బుధవారం) విశాఖపట్నంలో పర్యటించేందుకు గాను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రేపు(బుధవారం) విశాఖపట్నం(Visakhapatnam)లో పర్యటించేందుకు గాను షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని ఎస్‌పీజీ అధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్లో ‘నో ప్రైవేట్ డ్రోన్ ఫ్లై’ విధించారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
రేపు మధ్యాహ్నం 12:55 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15కి INS డేగాలో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు స్వాగతం చెప్పనున్నారు. సా.4:45 నుంచి మోడీతో కలిసి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రోడ్‌షోలో పాల్గొనున్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రధాని మోడీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. సభ ముగిసిన అనంతరం రాత్రి 7:30కి సీఎం చంద్రబాబు విజయవాడ బయల్దేరనున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రి 7:25 గంటలకు గన్నవరం బయలుదేరనున్నారు.