ఎఫ్ఐఆర్, రిమాండ్ కొట్టివేయండి.. హైకోర్టులో చంద్రబాబు పిటిషన్

ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు..

Update: 2023-09-12 08:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తన రిమాండ్ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద ఆయన క్రిమినల్ పిటిషన్ వేశారు. 20 పేజీలతో కూడిన క్రిమినల్ పిటిషన్ మెమోరాండాన్ని కోర్టులో దాఖలు చేశారు. తనపై ఉన్న రిమాండ్ ఆదేశాలను సస్పెండ్ చేయాలని కోరారు. తనపై ఎలాంటినిర్ధిష్ట ఆరోపణలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్ ఆదేశాలు సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. తనకు విధించిన రిమాండ్, స్పెషల్ కోర్టు చర్యలు చెల్లవని, 17(ఏ) పీడీ యాక్ట్ తనకు వర్తించదన్న చంద్రబాబు పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా ఎఫ్ఐఆర్, రిమాండ్ కొట్టివేయాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్‌ పేర్లను పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్‌కు సంబంధించి  గురువారం కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.  మరోవైపు చంద్రబాబుతో హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసుకు సంబందించి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని..  అందువల్ల హౌస్ రిమాండ్‌కు ఇవ్వాలని ఆయన తరఫున లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు హౌస్ రిమాండ్ కు ఇవ్వొద్దని.. రాజమండ్రి సెంట్రల్ జైలులో పటిష్ట భద్రత  ఉందని ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికాసేపట్లో తీర్పు రానుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News