ఏపీ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం.. ఎన్నికల తర్వాత ఫస్ట్ టైమ్ భేటీ కానున్న బాబు, పవన్..!

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 13 ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఏపీలో ఏ పార్టీ

Update: 2024-05-29 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 13 ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఏపీలో ఏ పార్టీ అధికారం పీఠం దక్కించుకుంటుందో తెలియనుంది. దీంతో జూన్ 4న వెలువడనున్న ఫలితాలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? నెక్స్ట్ ఏపీ ముఖ్యమంత్రి ఎవరూ అవుతారు..? వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుని జగన్ రెండో సారి ఏపీ సీఎం అవుతారా..? ఎన్డీఏ కూటమి పవర్‌లోకి వస్తుందా..? కూటమి గెలిస్తే సీఎం చంద్రబాబు అవుతారా..? పవన్ కల్యాణ్ అవుతారా..? అన్న చర్చలు ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే, గెలుపు ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి ధీమాగా ఉన్నాయి. మేమే గెలుస్తామని.. ప్రమాణ స్వీకారాల తేదీలను సైతం పార్టీలు ఖరారు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునుంది. ఈ నెల 31న టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. వీరితో పాటు 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. దీంతో 31వ తేదీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో బాబు, పవన్ కూటమి గెలిస్తే సీఎం ఎవరూ ఇతర ముఖ్య విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక, ఎన్నికల అనంతరం విదేశ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ ఉదయమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 31న కీలక భేటీ ఉండటంతో రేపు (గురువారం) రాత్రికి అమరావతికి బాబు వెళ్లనున్నారు. 


Similar News