రైతులకు అన్యాయం జరిగితే సహించం..కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు?

రైతులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.

Update: 2024-06-30 11:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: రైతులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నేడు(ఆదివారం) గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఆర్‌బీకేలు నిర్మించి అందులో రైతుల కోసం ఎరువులను నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈక్రమంలో ఖరీఫ్‌లో పంటల సాగుకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కృత్రిమంగా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News