Flood: మళ్లీ భయపెడుతున్న బుడమేరు... ఇళ్లలోకి భారీగా వరద నీరు

విజయవాడ వాసులను బుడమేరు వాగు మళ్లీ టెన్షన్ పెడుతోంది....

Update: 2024-09-05 13:14 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ వాసులను బుడమేరు వాగు మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మూడు రోజులుగా బుడమేర వాగు విలయతాండవం చేసింది. దీంతో అజిత్ సింగ్ నగర్‌తో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు, రోడ్లలో 4, 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు అందించింది.

అయితే బుడమేరు వాగు బుధవారం శాంతించడంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు విజయవాడ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరోసారి బుడమేరు వాగు భయబ్రాంతులకు గురి చేసింది. ఎగువ నుంచి బుడమేరు వాగుకు వరద ఉధృతి కొనసాగడం ప్రారంభమైంది. దీంతో స్థానిక రామకృష్ణాపురంలోని ఇళ్లలోకి మళ్లీ వరదనీరు చేరుకుంటోంది. మధ్యాహ్నం నుంచి రామకృష్ణాపురంలో వరద రెండు అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో రామకృష్ణాపురం వాసులకు టెన్షన్ మరోసారి పెరిగింది. 


Read more...

AP News:విజయవాడ పై బుడమేరు పంజా..జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న టీడీపీ నేత 


Similar News