Breaking: రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్షద్ అనే ఆత్మహత్యకు యత్నించారు.
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్షద్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. తన తండ్రికి సంబంధించిన 75 సెంట్ల స్థలాన్ని వేరే వారి పేరుపైకి మార్చారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు అడ్డుకుకోవడంతో అర్షద్‌కు ప్రమాదం తప్పింది. తన తండ్రి స్థలాన్ని తన పేరుపైకి మార్చాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదని అర్హద్ ఆరోపించారు. ఆధారాలు చూపించినా అధికారులు పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. తనకు న్యాయం చేకపోతే ఆత్మహత్యే శరణ్యమని అర్షద్ వాపోయారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే వ్యక్తం ఒక్కసారిగా ఎమ్మార్వో కార్యాలయం వద్ ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.