BREAKING: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ.. నేతల మధ్య భగ్గుమన్న ఆధిపత్య పోరు
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ, జేనసేనకు అప్పగించింది. దీంతో అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ నేత వర్మ అండదండలు, సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే నియోజవర్గ వ్యాప్తంగా టీడీపీ, జనసే నాయకుల మధ్య అధిపత్య పోరు మొదలైంది. తాజాగా, పిఠాపురం పరిధిలోని తాటిపర్తి ఆలయ బాధ్యతలపై రచ్చ కొనసాగుతోంది. గుడిపై సర్వ హక్కుల తమకంటే తమకే.. ఉన్నాయంటూ రెండు పార్టీ వారు బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తోంది. కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇలా అల్లర్లు చేలరేగండం కూటమిలో కుంపటి పెట్టేలా ఉన్నాయంటూ ఇరు పార్టీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.