Breaking : విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్‌లో వివాదం..

ఈ రోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసందే.

Update: 2024-08-07 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసందే. కాగా ఈ ఎన్నికల్లో కూటమి,వైసీపీ పార్టీలు పది కి పది సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేశాయి.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీ కి చెందిన కార్పొరేటర్లు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో.. కౌంటింగ్ పై వైసీపీ పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్ళడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 


Similar News