Hyd: ఏపీ రాజధానిపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
అమరావతి రాజధానికి కట్టుబడే వనరులు కేటాయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: అమరావతి రాజధానికి కట్టుబడే వనరులు కేటాయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి రూ. 2500 కోట్లు బీజేపీ ఇచ్చిందని ఆమె తెలిపారు. రూ.20 వేల కోట్లతో అమరావతి చుట్టూ అవుటర్ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదించిందని చెప్పారు. అమరావతి రాజధాని అనే విశ్వంతోనే కేంద్రం సహకరించిందని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తామూ కూడా కట్టుబడి ఉన్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికొన్ని నెలల్లో విశాఖ షిప్ట్ అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎంవోతో పాటు ఆయన పక్కనే ఉండేలా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అటు సీఎం జగన్ కూడా విశాఖకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీగా గతంలో పని చేసిన పురంధేశ్వరి ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.