వైసీపీని బ్యాట్‌తో సూపర్ సిక్స్ కొడతాం: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కౌంటర్

వైసీపీని బ్యాట్‌తో సూపర్ సిక్స్ కొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్ట్రాంగ్ ఇచ్చారు....

Update: 2024-10-07 08:52 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(YCP)ని బ్యాట్‌తో సూపర్ సిక్స్(Super Six) కొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(BJP MLA Adinarayana Reddy) స్ట్రాంగ్ ఇచ్చారు. కడపలో ఆదినారాయణరెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి(YCP MLC Ramasubba Reddy)గా రాజకీయం మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇద్దరి నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని, ఐదేళ్ల పాటు సూపర్ సిక్స్ కోసం ఎదురుచూడాలని రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ఆదినారాయణ రెడ్డి స్పందించారు. సంక్రాంతికి సూపర్ సిక్స్ ప్రారంభిస్తామని తెలిపారు. అప్పుడు వైసీపీని బ్యాట్‌తో సూపర్ సిక్స్ కొడతామని ఆదినారాయరెడ్డి సెటైర్లు వేశారు. 


Similar News