YS జగన్ కోడి కత్తి కేసులో బిగ్ ట్విస్ట్.. NIA అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు బెయిల్ రద్దుకు దేశ

Update: 2024-07-15 13:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్ఐఏ అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితుడి శ్రీనివాస్‌‌కు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా, 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాస్ దాదాపు ఐదేళ్ల పాటు జైళ్లలో ఉండగా.. ఇటీవల ఏపీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ కేసును విచారిస్తోన్న ఎన్ఐఏ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎన్ఐఏకు నిరాశ ఎదురైంది.


Similar News