ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్
నియోజకవర్గం లోని కొండ్లపూడి గ్రామ సర్పంచ్ కుమారుడు ఏకుల చంద్ర మరియు సర్పంచ్ కుమార్తె ఏకుల శాంతకుమారి టీడీపీలో చేరారు.
దిశ ప్రతినిధి,నెల్లూరు:నియోజకవర్గం లోని కొండ్లపూడి గ్రామ సర్పంచ్ కుమారుడు ఏకుల చంద్ర మరియు సర్పంచ్ కుమార్తె ఏకుల శాంతకుమారి టీడీపీలో చేరారు.అదే బాటలో ఇద్దరు వార్డు మెంబర్లు ఇరగా రమణయ్య, శరత్ ముఖ్య నాయకులు ఉమ్మడి రమేష్ వైసీపీకి రాజీనామా చేసి, కోటంరెడ్డి సోదరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నాటికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేందుకు కూడా ఎవరూ మిగలరు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఏ ఒక్క అధికారి కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వినే పరిస్థితి ఉండదు. దైర్యంగా ఉండండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజారిటీతో నెల్లూరు రూరల్ లో టీడీపీ, జనసేన కూటమి గెలవబోతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెడిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ నాయకులు ఒంటేరు విజయ్ కుమార్, ఒంటేరు రవి, ఎస్. లావణ్య, ఒంటేరు మధు, వెడిచర్ల రామయ్య, ఉప్పాల చిన్నబ్బయ్య, పఠాన్ ఖాదర్ వలీ, షేక్ సయ్యద్ బాబా, కోటయ్య, కిష్టయ్య, పి.అశోక్, ప్రశాంత్, టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.