విశాఖలో జగన్‌కి బిగ్ షాక్: జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ?
విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? వైసీపీ ఎమ్మెల్సీ ఆ పార్టీ వీడి జనసేన గూటికి చేరబోతున్నారా?
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? వైసీపీ ఎమ్మెల్సీ ఆ పార్టీ వీడి జనసేన గూటికి చేరబోతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితోనే ఆఎమ్మెల్సీ పార్టీ వీడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారని ఇందులో భాగంగానే వంశీకృష్ణ ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నాం 2గంటలకు వంశీకృష్ణ జసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎమ్మెల్సీ వంశీకృష్ణ విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ టికెట్ ఇస్తారనే భావించారు. అయితే టికెట్‌పై ఎలాంటి హామీ రాకపోవడంతో వంశీకృష్ణ ఇక వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగింది. అయినప్పటికీ వంశీకృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
వర్గపోరుతో తలనొప్పి
విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరతారని తెలుస్తోంది.ఇందులో భాగంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వంశీ కృష్ణ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు.అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. దీంతో వంశీకృష్ణ యాదవ్ అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో వంశీకృష్ణ యాదవ్ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం వంశీ కృష్ణకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారిని సైతం వైసీపీలోని ఓ వర్గం అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను పక్కనబెడితే ఎందుకు అని ఎమ్మెల్సీ వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
భీమిలి నుంచి పోటీ
ఇదిలా ఉంటే వంశీకృష్ణ యాదవ్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వంశీ కృష్ణయాదవ్ పీఆర్పీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. కనీసం 2024 ఎన్నికల్లోనైనా విశాఖపట్నం తూర్పు టికెట్ ఇస్తారని ఆశించారు. కానీ ఎలాంటి హామీ రాకపోవడంతో ఇక వైసీపీలో ఉండటం ఇష్టంలేక జనసేన గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జనసేన పార్టీ నుంచి టికెట్ హామీ వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖపట్నం తూర్పు టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పడతాయని ఫలితంగా వంశీకృష్ణ యాదవ్ గెలుపొందే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వంశీ కృష్ణయాదవ్ అంచనాలు ఏమేర సక్సెస్ అవుతాయో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.