ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్
ఏపీ హైకోర్టులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే ఇప్పుడు వర్తిస్తాయని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల పోలింగ్ రోజు రెంటచింత మండలం పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పాటు ఇతర కేసుల్లో సైతం ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.