AP News:వరద బాధితులకు బిగ్ రిలీఫ్..ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడను వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-06 08:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడను వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 179 సచివాలయాల పరిధిలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అయితే నేటి నుంచి వరద బాధితులకు సాయంగా ముంపునకు గురైన వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యి MDU రేషన్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలును ప్రభుత్వం అందజేస్తోంది. నిన్న(గురువారం) మంత్రి మనోహర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు(శుక్రవారం) పంపిణీ వ్యవస్థను పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ..వరదల్లో చిక్కుకున్న వారికి నిన్నటి వరకు ఆహారం, నీళ్లు, పాలు ప్రభుత్వం అందజేసిందన్నారు. అయితే ఈ సరుకులను రేషన్ కార్డులో పేరును బట్టి వేలిముద్రల ఆధారంగా అందజేస్తామన్నారు. ఇక రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ఆధారంగా అందిస్తామన్నారు. మూడు నాలుగు రోజుల పాటు ఈ పంపిణీ జరుగుతుందని తెలిపారు.


Similar News