BIG BREAKING : స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన 17A ఎఫ్ఐఆర్‌‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-01-13 11:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన 17A ఎఫ్ఐఆర్‌‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేసు పూర్వపరాలు, ఇరు పక్షాల వాదనలు విన్న అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పును ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వెల్లడించనుంది. అయితే, గత సంవత్సరం అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్‌నెట్‌ కేసు విచారణ చేపడతామని.. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News