pensioners: పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్.. పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఆగస్ట్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-07-27 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్ట్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టిన ప్రభుత్వం.. వచ్చే నెల కూడా సేమ్ ఇదే విధంగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులకు సూచించింది. ఈ నెల 31వ తేదీనే బ్యాంక్ నుండి డబ్బులు విత్ డ్రా చేసుకుని 1వ తేదీ నుండి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాలని ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని పేర్కొంది.

1వ తేదీనే 99 శాతం పెన్షన్ల పంపిణీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని.. ఏదైనా కారణాల వల్ల ఫస్ట్ తేదీన తీసుకోని లబ్ధిదారులకు 2వ తారీఖున ఇవ్వాలని ఈ మేరకు సెర్ఫ్ సీఈవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇటీవల ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పెన్షన్ పంపిణీ జూలై నుండే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తే.. చంద్రబాబు సర్కార్ మాత్రం పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్‌లో వాలంటీర్లను పక్కకు పెట్టి సచివాలయ ఉద్యోగులు ద్వారా పంపిణీ చేయిస్తోంది. 


Similar News