Tirumala News:భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తి శ్రద్దలతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తాజాగా టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ నెల(మార్చి) 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కారణంగా 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana) ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం రేపటి(సోమవారం) నుంచి అమలులోకి రానుందని టీటీడీ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(ఆదివారం) సిఫార్సు లేఖలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది.