చంద్రబాబుతో భువనేశ్వరి,బ్రహ్మణిల ములాఖత్: అచ్చెన్నాయుడు సైతం..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-25 08:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ములాఖత్ కానున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ములాఖత్‌లో భాగంగా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఇందుకు సంబంధించి జైలు అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే సోమవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారులు అనుమతి మంజూరు చేశారు. ఇకపోతే చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ నారా భువనేశ్వరి సోమవారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగ్గంపేటలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని భువనేశ్వరి సందర్శించారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉంటున్న ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సింహంలా గర్జిస్తూ జైలు నుంచి బయటకు వస్తారని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More..

దేవుడు ఉన్నాడు.. నాకు దారి చూపిస్తాడు : నారా భువనేశ్వరి  

Tags:    

Similar News