Bhumana: శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం.. స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్

తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-09-22 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారంపై తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం శ్రీవారికి కళంకం అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్రకు తెర లేపారని ఆరోపించారు. అందుకు ఏకంగా శ్రీవారినే పావుగా వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ విజిలెన్స్ కమిటీ నివేదిక చంద్రబాబు నచ్చలేదని, అందుకే కొత్తగా లడ్డూ ప్రసాదం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

హత్యా రాజకీయాల కంటే ఇవాళ చంద్రబాబు చేస్తున్నది నీచమైన రాజకీయమని అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అశంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాళ్లింటి దేవుడని చెప్పుకునే చంద్రబాబు చివరికి శ్రీవారిని కూడా రాజకీయంగా వాడుకున్నారని ఎద్దేవా చేశారు. శకుని బతికుంటే చంద్రబాబుని చూసి బోరున ఏడ్చేవాడని కామెంట్ చేశారు. నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని గతంలో ఈవో చెప్పారని తెలిపారు. చంద్రబాబు బెదరించిన తరువాత ఆయనకు కూడా మాట మార్చారని ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య కాలంలో టీటీడీలో నందిని నెయ్యి ఎందుకు వాడలేదని కలుషితమైంది నెయ్యి కాదని.. చంద్రబాబు మానసిక స్థితి అని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.


Similar News