AP News:‘ఒక ఆంబోతు తిరుమలకు వచ్చింది’.. భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

Update: 2024-11-12 10:11 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మువ్వల వెంకట సుబ్బయ్య, శ్రీధర్, మాదల రమేష్, పట్నాయక్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అతి పెద్ద ధార్మిక క్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా నాకు అవకాశం కలిపించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో టీటీడీలో సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయి.

గత ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాలు మాయం చేసి విధ్వంస ఘటనలు సృష్టించారని ఆయన ఫైరయ్యారు. ఈ క్రమంలో పవిత్రత కాపాడుకునేందుకు గతంలో నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందన్నారు. గతంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు వెబ్సైట్‌లో పొందపరిచలేదని.. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు అని విమర్శించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల నుంచి దోచుకున్న డబ్బుని మొత్తం కక్కిస్తాము అన్నారు. అధర్మ కార్యక్రమాలు చేసిన వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక పాలన అనేది గత ఐదు సంవత్సరాలు జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మ పరిరక్షణకై పని చేస్తుందన్నారు.

ఒక ఆంబోతు టీటీడీ కి వచ్చింది ఒక మంత్రిగా పని చేసిన ఈ వ్యక్తి వైఎస్ జగన్ ఫొటోతో ఉన్న ఒక చిహ్నం వేసుకుని దర్శనానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తుల పై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరించారు. కొండ పైకి వచ్చిన ఏ రాజకీయ నాయకుడైన సరే టీటీడీ నియమ నిబంధనలు పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు. జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి కొందరు శ్రీవారి కొండపైకి వచ్చి రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు. అన్యమతస్తులు ఎవరైతే వస్తారో వారు తప్పనిసరిగా టీటీడీ నిబంధనలు ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేసి తీరాలని చెప్పారు. శ్రీవారి కొండపై రాజకీయ ప్రసంగాలు చేసిన, ఇతర ఎలాంటి దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. మనం అందరం భక్తుల కోసం పనిచేయాలి భక్తుల సౌకర్యార్థం పూర్తి దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News