ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్.. హీటెక్కనున్న పాలిటిక్స్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎంపీ బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎంపీ బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏపీ బీజేపీ కో ఇన్‌చార్జిగా బండి సంజయ్‌ను నియమిస్తారనే ప్రచారం జరిగింది. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. ఇదే తరుణంలో ఏపీలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ రథసారథిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వంపై అమీతుమీకి బీజేపీ సిద్ధమైందని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో బండి సంజయ్ సేవలను ఏపీలో వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో ఇన్‌వాల్వ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక ఏపీ వంతు..
ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో బండి సంజయ్‌ను క్రియాశీలకం చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో బండి సేవలను తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఉపయోగించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నెల 21 న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతిలో పర్యటించబోతున్నారు. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. మొదటిసారిగా బండి సంజయ్ ఏపీకి వెళుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.