ఈ నెల 5 వరకూ పల్నాడు జిల్లా బంద్.. పోలీసుల సంచలన నిర్ణయం

Update: 2024-06-02 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి.  ఆ సమయంలో పోలింగ్ కేంద్రాల్లో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లాలో మాత్రం హైటెన్షన్ నెలకొంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. కత్తుల, రాడ్లు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వందలాది మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.  దీంతో పోలీసులు కేంద్ర బలగాల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోసారి పునారావృతం కాకుండా ఉండేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఆదివారం నుంచి ఈ నెల 5 వరకూ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇప్పటికే బంద్ కొనసాగిస్తున్నారు.  ఇందులో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. నరసరావుపేటను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లాడ్జిలు, కల్యాణ మండపాలను సైతం మూసివేశారు.చిన్న ఘర్షణ జరిగినా రౌడీషీట్ తెరుస్తామనిహెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పల్నాడు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు  


Similar News