Breaking:బాలినేని ఫిర్యాదు..ఈవీఎంల చెకింగ్‌కి ఈసీ గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Update: 2024-08-10 04:08 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామాకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. దీంతో ఈవీఎంల పరిశీలనకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజినీర్లతో డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఫిర్యాదుదారునికి చూపించనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈ నెల 19 నుంచి 24 వరకు పరిశీలిస్తామన్నారు.

Tags:    

Similar News