AP: నేటి నుంచి రాష్ట్రంలో కులగణన పక్రియ ప్రారంభం..
అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూతను అందించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది.
దిశ, వెబ్‌డెస్క్ : అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూతను అందించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు నేటి నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వాలంటీర్లు కులగణనలో భాగస్వాములు కాబోతున్నారు. నేటి నుంచి సరిగ్గా పది రోజుల పాటు అంటే ఈనెల 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కులగణనలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆన్‌లైన్‌లోనే అన్ని వివరాలను నమోదు చేయనున్నారు. ఒక వేళ ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఈ నెల 28 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ సచివాలయాల్లో నమోదు చేయించుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు.