AP- TET: రేపే ఏపీ టెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో టెట్ ఫలితాలు(TET Results) రేపు విడుదల కానున్నాయి.

Update: 2024-11-03 10:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో టెట్ ఫలితాలు(TET Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 2న విడుదల కావాల్సిన టెట్ ఫలితాలను పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ అభ్యర్ధులు(DSc Aspirents) ఎదురు చూస్తున్న టెట్ జూలై-2024 పరీక్షా ఫలితాలను సోమవారం మంత్రి నారా లోకేశ్(Lokesh Nara) విడుదల చేయనున్నారు. దీని కోసం ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇక త్వరలోనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న క్రమంలో టెట్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఏపీలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4,27,300 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలను 17 రోజుల పాటు ఆన్ లైన్ విధానంలో నిర్వహించారు.

Tags:    

Similar News