వైసీపీ ప్రైవేట్ సైన్యంలా ఏపీ పోలీసులు : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరు తాలిబన్ల పాలనను తలపించేలా ఉందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.

Update: 2023-11-05 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరు తాలిబన్ల పాలనను తలపించేలా ఉందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలకు గురిచేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి నేరచరిత్రలేని, కనీసం కేసులు కూడా లేని టీడీపీ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణపై పోలీసుల దాష్టీకం దారుణం అని అన్నారు. ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించడమే కాకుండా చేతులు వెనక్కికట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. ఈ చర్యలు తాలిబాన్ రాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బహిరంగ వేదికలపై నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీలు అంటూ దొంగ ప్రేమలు ఒలకబోస్తున్నారని అన్నారు. పైకి లేని ప్రేమను ఒలకబోస్తూ ఆయావర్గాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ ప్రైవేట్ సైన్యంగా మారి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణిచివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పోలీసులు రాజ్యహింసను ఆపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు.


చేతులు వెనక్కి కట్టి..నోట్లో గుడ్డలు కుక్కి

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని నారా లోకేశ్ ఆరోపించారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం అత్యంత దారుణమని అన్నారు. టీడీపీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన కల్లూరు సీఐపై రాష్ట్ర డీజీపీ తక్షణమే విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News